SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

సేవా కార్యక్రమాల రూపంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు : రామకృష్ణాపూర్‌ కాంగ్రెస్ శ్రేణులు

రామకృష్ణాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు .ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనతరం పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ మాట్లడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హంగు ఆర్భాటాలకు దూరంగా, ఈ వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం విశేషం అని, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.అలనే దేశం కోసం
ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని నాయకులు కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజాసేవలో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ పట్టణాధ్యక్షుడు పల్లె.రాజు , కౌన్సిలర్లు కూతురు.ప్రభాకర్ , గుర్రం. శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గోపతి. బానేష్, పట్టణ ఉపాధ్యక్షులు కాసర్ల. ప్రకాష్, మంద. సృజన , ప్రధాన కార్యదర్శి మేకల. సురేందర్, అధికార ప్రతినిధి మాదాసు. రాజ్ కుమార్, కార్యదర్శులు పైడాకుల. శ్రీనివాస్, భైర. మల్లేష్, నర్రా శ్రీనివాస్, మహిళా నాయకులు కొలిపాక. దీప, పుష్ప, రాజేశ్వరి, లక్ష్మీ, నాయకులు రాజ్ కుమార్, అలుగుల. నాగరాజు, గూడ. సత్తయ్య, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అనర్హులా ? : బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

ఘనంగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి – సరోజన దంపతుల వివాహా వార్షికోత్సవ వేడుకలు

siti news telangana

బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు : మందమర్రి ఏరియా

siti news telangana