ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో
పట్టణ అధ్యక్షులు మంద.తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎంతో వైభవంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా సమాజంలో ప్రత్యేక ఆదరణ అవసరమైన పిల్లల మధ్య,పార్టి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ , విద్యార్థిని విద్యార్దులకు పుస్తకాలు, మిఠాయిలు (స్వీట్లు), పండ్లను పంపిణీ చేసి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు.
అనతరం వారు మాట్లడుతూ దేశ ప్రజల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి ముక్య అతిధి గా డిసిసి అధ్యక్షులు
రఘునాథ్ రెడ్డి హజార్ కాగా, నోముల ఉపేందర్ గౌడ్, పుల్లురి.లక్ష్మన్, సంగి సదానందం, బేర.వేణు, వై.పవన్, శామ్యూల్, పోలు.సంపత్,కుండే.రామకృష్ణ ,ముదరపు.శేకర్, సట్ల సంతోష్, రకం సంతోష్, కొక్కుల.మధు, శ్రీనివాస్, సుకర్, సారంగపాణి తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళాలు, మనోవికాస్ పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

