SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్ వివేక్ వెంకటస్వామి , ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి ఎం.ఎన్.ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ & ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, SIR ముసుగు వేసుకొని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఓటు చోరీ అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో గళం విప్పారని గుర్తు చేశారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పకడ్బందీగా పరిశీలించాలని,చనిపోయిన ఓటర్ల వివరాలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా ప్రాజెక్టుల పేరుతో భారీ అప్పులు చేసి, కమిషన్ల రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు.ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తోందని, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వ  పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహార భోజనం అందిస్తున్నామని, BLAలు ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో త్వరలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, కాకా ఫౌండేషన్ ద్వారా 2,500 బోర్‌వెల్లు ఏర్పాటు చేయడంతో పాటు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నీటి ఎద్దడి ప్రాంతాల్లో 400 బోర్‌వెల్లు వేయించామని తెలిపారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, దేశంలో సిట్టింగ్ స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం SIR ముసుగులో ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. అలాగే నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా 120 ATC సెంటర్ల ద్వారా 25 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. టామ్‌కామ్ (TOMCOM) ద్వారా మరో 10 వేల మంది యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు.చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని,నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి గ విశేషంగా కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కార్మిక క్షేత్ర పరిసర ప్రాంతాల యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించడమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana

మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన..

siti news telangana

సి.ఎం.ఓ.ఏ.ఐ ఆధ్వర్యంలో అధికారుల రెండవ రోజు రిలే నిరాహార దీక్ష : మందమర్రి ఏరియా

siti news telangana