SITI NEWS TELANGANA
బ్రేకింగ్ న్యూస్ స్థానిక వార్తలు

జీతాలు అడిగితే తన్నులా? – మందమర్రి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ సూపర్వైజర్ గుండాయిజం

మందమర్రి టోల్ ప్లాజా (NH-363) మరోసారి ఉద్రిక్తతకు వేదికైంది. ఇప్పటికే వాహనదారులు, నిర్వాసితుల గొడవలతో నిత్యం వార్తల్లో ఉండే ఈ టోల్ ప్లాజాలో, ఈసారి లోపల పనిచేసే సిబ్బందిపైనే యాజమాన్యం ప్రతాపం చూపించింది. గత కొన్ని నెలలుగా సమయానికి జీతాలు రావడం లేదు అని ప్రశ్నించిన స్థానిక ఉద్యోగులపై, టోల్ ప్లాజాను నిర్వహిస్తున్న ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి చెందిన సూపర్వైజర్ భౌతిక దాడికి   దిగడం తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ సందర్భంగా సిబంది మాట్లడుతూ పట్టణానికి చెందిన పలువురు యువకులు కంప్యూటర్ ఆపరేటర్లుగా, క్యాషియర్లుగా, లైన్ స్టాఫ్‌,డ్రైవర్లు గా పనిచేస్తున్నారు అని . వీరికి ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ గత కొన్ని నెలలుగా సరైన సమయంలో లో వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తునారని , జీతాలు లేక రూమ్ అద్దెలు కట్టలేక, కుటుంబాలు గడవక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వారు వాపోయారు .

ఈ క్రమంలోనే, విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు టోల్ ప్లాజా మేనేజ్‌మెంట్ ప్రతినిధి అయిన ప్రైవేట్ సూపర్వైజర్‌ను కలిసి “మా జీతాలు ఎప్పుడు వేస్తారు? ప్రతి నెల ఇంతేనా?” అని , తమ హక్కుల కోసం శాంతియుతంగా ప్రశ్నిస్తున్న క్రమం లో ఉద్యోగి పై సూపర్వైజర్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి , దుర్భాషలాడుతూ “దిక్కున్న చోట చెప్పుకోండి.. జీతాలు ఇంతే వస్తాయి, ఇష్టముంటే చెయ్యండి లేకపోతే మానేయండి” అంటూ ఉద్యోగులపై బూతులతో రేచిపోయాడు అని , అంతటితో ఆగకుండా, ఎదురు ప్రశ్నించిన ఒక ద్యోగిపై  సూపర్వైజర్ చేయి చేసుకుని విచక్షణ రహితంగా కొట్టాడని తోటి సిబ్బంది అడ్డు వచ్చిన వినకుండా దాడికి పాలుపడ్డాడని వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు . అదేవిధంగా ఘటనపై న్యాయం కొరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.

Related posts

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

siti news telangana

ఘనంగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి – సరోజన దంపతుల వివాహా వార్షికోత్సవ వేడుకలు

siti news telangana

గోవాలో ఘోర పడవ ప్రమాదం: 23 మంది మృతి, 64 మంది గల్లంతు.

siti news telangana