SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

జూన్ 10వ తేదీన ప్రారంభం కానున్న జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమం

జర్మన్ భాషా శిక్షణ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు..

జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ…

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అందిస్తున్న జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10వ తేదీన ఉదయం 10 గంటలకు మందమర్రి ఏరియా లో గల ఇల్లందు క్లబ్ లో రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకా వెంకటస్వామి చేతుల మీదుగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, జర్మనీ తో పాటు ఇతర యూరోపియన్ దేశాలలో ఉపాధి అవకాశాలను పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలను అభ్యర్థులకు అందించడం జరుగుతుందని,జర్మన్ భాషలో ప్రాథమిక, మధ్యస్థాయి పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు సన్నద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Related posts

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

siti news telangana

భిన్నత్వంలో ఏకత్వానికి అద్దంగా : మొహర్రం వేడుకలు..

siti news telangana

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్నికి సత్కారం : మంత్రి వివేక్ వెంకట స్వామి

siti news telangana