SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

అధికారుల సంఘం ఆధ్వర్యంలో 5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు: మహిళా అధికారుల సంఘీభావం

ఐదో రోజుకు అధికారుల సంఘం రిలే నిరాహార దీక్షలు..

మందమర్రి ఏరియా :
అధికారుల సంఘం పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అధికారులు చేస్తున్న ఈ దీక్షలు ఉత్సాహంగా, శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు దీక్షా బిరానికి నిరసనకారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న అధికారులకు మద్దతుగా తోటి మహిళా అధికారులు, లేడీ ఎగ్జిక్యూటివ్స్ భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారు,ఉద్యోగుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో తాము సైతం భాగస్వామ్యులవుతామని స్పష్టం చేశారు.

తడనతరం సంఘం అద్యేక్షులు ఎస్.రమేష్ మాట్లడుతూ ఐదు రోజులుగా దీక్షలు జరుగుతున్నా ప్రభుత్వం/యాజమాన్యం నుంచి ఆశించిన స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని, లేనిపక్షంలో ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.అలనే అధికారుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు మా మద్దతు కొనసాగుతుంది అని, న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో అందరం సమిష్టిగా ముందుకు సాగుతామని, మహిళా అధికారులు తరలిరావడం తో ఈ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చిందని వారు పేర్కొన్నారు.

Related posts

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

siti news telangana

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అనర్హులా ? : బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో 100 మొక్కల నాటిన సిబంది.

siti news telangana