SC సెల్ కార్యదర్శిగా బాధ్యత అప్పగించడం గౌరవం కాదు.. అణగారిన వర్గాల కోసం పనిచేసే గొప్ప బాధ్యత: సోమారపు సామెల్
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ SC సెల్ కార్యదర్శిగా తనను నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు సోమారపు సామెల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతను ప్రజల కోసం పనిచేసే అవకాశంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్, గనులు & భూగర్భశాస్త్ర శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, TPCC SC డిపార్ట్‌మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ SC సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, మందమర్రి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
“ఇది పదవి కాదు.. ప్రజల కోసం పనిచేసే బాధ్యత. అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిబద్ధతతో పనిచేస్తా” అని సామెల్ పేర్కొన్నారు.
