డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొంది నివాసం ఉండని వారికి అధికారుల సూచనా..
స్పందించకుంటే కేటాయింపులు రద్దు!
మందమర్రి పట్టణం లో డబల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొంది కూడా వాటిలో నివాసం ఉండని లబ్ధిదారులపై
అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ బన్సీలాల్ మాట్లడుతూ ప్రభుత్వం నిరుపేదలకు అందించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కొందరు లబ్ధిదారులు వినియోగించకుండా ఖాళీగా ఉంచడం,మరికొందరు అద్దెకు ఇవ్వడంపై అధికారులు దృష్టి వచ్చిందని ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టి ఇళ్లలో నివాసం ఉండని వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఫోన్ ద్వారా కూడా లబ్ధిదారులకు సమాచారం అందిస్తూ, వారం రోజుల్లోగా కేటాయించిన ఇళ్లలో నివాసం ఉండాలని,అద్దెకు ఇచ్చినట్లు లేదా లబ్ధిదారులు స్వయంగా నివాసం ఉండకుండా ఇళ్లను ఖాళీగా ఉంచినట్లు నిర్ధారణ అయితే, నిబంధనల ప్రకారం కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.ఇలా రద్దు చేసిన ఇళ్లను నిజంగా ఇల్లు లేని,అర్హత కలిగిన నిరుపేదలకు కేటాయిస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. హెచ్చరిక నోటీసులకు స్పందించకుండా ఇళ్లను ఖాళీగా ఉంచినా,అద్దెకు ఇచ్చినా కేటాయింపు రద్దు తప్పదని అధికారులు హెచ్చరించారు.
