SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

పచ్చని భవిష్యత్తు కోసం మందమర్రి ఏరియాలో ఘనంగా మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్

పర్యావరణ పరిరక్షణలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని..

మందమర్రి :

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ మందమర్రి ఏరియాలో మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా  బృహత్ వృక్షారోపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి హరితహారానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ కేవలం నల్ల బంగారమైన బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున చేపడుతున్న వృక్షారోపణ కార్యక్రమాల ద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, వివిధ విభాగాల ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో​ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం,జి ఎల్ ప్రసాద్, ఎస్.కె ఏజెంట్ సంతోష్ కుమార్, కేకే ఏజెంట్ ఖాదిర్, ఐ ఈ డి (డి జి యం) కిరణ్ కుమార్, ఫారెస్ట్ అధికారి నవీన్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి తో పాటు వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు , కార్మికులు పాల్గొని మొక్కలు నాటారు.

Related posts

ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం

siti news telangana

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

siti news telangana

మందమర్రి కోర్టు నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ నిర్మల

siti news telangana