SITI NEWS TELANGANA
భక్తి

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు–గాజుల పండుగ…

మందమర్రి పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గోరింటాకు–గాజుల పండుగనుఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం మహిళలకు గోరింటాకు పెట్టి, గాజులు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అలానే మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొని వేడుకను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తమ్మిశెట్టి మంజుల , సెక్రెటరీ గడ్డం మాలతి , కోశాధికారి గంప శ్రీదేవి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగా, పలువురు మహిళలు, స్థానిక ప్రముఖులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Related posts

మందమర్రిలో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు

siti news telangana

సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.

siti news telangana