SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రి ఏరియాలో 20వ స్ట్రక్చర్ మీటింగ్ – కార్మిక సంక్షేమంపై ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్.

మందమర్రి :
సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, వారి పలు సమస్యల పరిష్కారానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో 20వ నిర్మాణాత్మక సమీక్షా సమావేశం (స్ట్రక్చర్ మీటింగ్) శాంతియుత వాతావరణంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో గత స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించిన అంశాల అమలు పురోగతిని అధికారులు, యూనియన్ ప్రతినిధులు సుదీర్ఘంగా సమీక్షించారు. ఉత్పత్తి లక్ష్యాలతో పాటు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం  ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐటీయూసీ ప్రతినిధులు కోరారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పలు కీలక సమస్యలను జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆపరేటర్లకు అవసరమైన పనిముట్లు, రెయిన్‌కోట్లు తక్షణమే అందించాలని, పెండింగ్‌లో ఉన్న టెండల్ సూపర్వైజర్ ప్రమోషన్ పరీక్షను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వర్క్‌షాప్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఎస్ అండ్ పీసీ మహిళా సెక్యూరిటీ గార్డులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జీఎం ఎన్. రాధాకృష్ణ హామీ ఇచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు. కార్మిక సంక్షేమం, భద్రత, ఉత్పాదకత పెంపు లక్ష్యంగా యాజమాన్యం–యూనియన్ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ముందుకు సాగాలని సమావేశంలో అభిప్రాయం తెలిపిందని వారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎస్.ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏరియా ఈ అండ్ ఎం, బాలాజీ భగవతి ఝ,కే కే గ్రూప్ ఏజెంట్, ఖాదిర్,గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (పర్సనల్) అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్,డీజీఎం (సివిల్) షేక్ మదీనా భాష, డీజీఎం ఏరియా స్టోర్స్,రవీందర్, వర్క్ షాప్ డివై ఎస్సీ, నరేష్, ఎస్ ఎస్ ఓ(ఎస్ & పి సి)వెంకటేశ్వర రెడ్డి, ఫారెస్ట్ అధికారి నవీన్, సీనియర్ పి.ఓ కార్తీక్, ఏ.ఐ.టి.యు.సి మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ, సలేంద్ర సత్యనారాయణ,బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ, దాగం మల్లేష్, రామకృష్ణపూర్ బ్రాంచ్ సెక్రటరీ, అక్బర్ అలీ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి​,కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్, సివి రమణ , జిఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ రాజేశం తో పాటు సీనియర్ అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Related posts

నకిలీ పత్తి విత్తనాల రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్ సీజ్

siti news telangana

కార్మిక క్షేత్ర పరిసర ప్రాంతాల యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించడమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana

ఘనంగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి – సరోజన దంపతుల వివాహా వార్షికోత్సవ వేడుకలు

siti news telangana