మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకరాచార్యులు తో పాటు వేద పండితులు శ్రీనివాసాచార్యులు, పాండే ల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి, వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు.
ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, గోదావరిఖని ఎస్వోటూ జీఎం రామ్మోహన్రావుతో పాటు పట్టణప్రముఖులు హాజరై సాయిబాబా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
