SITI NEWS TELANGANA
తెలంగాణ

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన..

మందమర్రి ఏరియా సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట గుర్తింపు సంఘ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్ట్రక్చర్ మీటింగ్లలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడం వెనుక అంతర్యం ఏమిటో తెలపాలని, మెడికల్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేసి, పెండింగ్లో ఉన్న సమస్యలతోపాటు 350 మంది డిపెండెంట్ లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ ను యాజమాన్యమై చెల్లించాలని, సొంతింటి కలలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ  కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి సురేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్, సెంట్రల్ సెక్రెటరీ అక్బర్ ఆలీ, బెల్లంపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రెటరీ దాసరి తిరుపతి, బ్రాంచ్ నాయకులు కంది శ్రీనివాస్, బానయ్య ,రాజేశ్వరరావు, శర్మ తో పాటు అనుబంధ సంఘ నాయకులు ,కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు.

Related posts

డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడూదాము: మందమర్రి రన్నర్స్ టీం

siti news telangana

నిఘా నీడలో బొగ్గు రవాణా : ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ

siti news telangana

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వార తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల : మంత్రి వివేక్ వెంకటస్వామి