SITI NEWS TELANGANA
తెలంగాణ స్థానిక వార్తలు

కార్మిక క్షేత్ర పరిసర ప్రాంతాల యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించడమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల పిల్లలు అలనే స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు ఒక గొప్ప అవకాశం..

తెలంగాణ రాష్ట్ర కార్మిక , ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సింగరేణి ప్రాంత యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా,జర్మనీలో ఉద్యోగాల సాధన కోసం ఉచిత జర్మన్ భాషా శిక్షణ శిబిరాన్ని మందమర్రి ఏరియా లో ఇల్లందు క్లబ్ లో అదనపు కలెక్టర్ చంద్రయ్య ,ఏరియా జి ఎం రాధాకృష్ణ తో కలిసి జోతి ప్రాజ్వాలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లడుతూ సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని (సింగరేణి కార్మికుల పిల్లలు అలనే స్థానిక యువతకు) నర్సింగ్, పారామెడికల్, హాస్పిటాలిటీ , టెక్నికల్ రంగాలలో జర్మనీలో ఉద్యోగ అవకాశాలు లభించేలా చేయడం ప్రజాప్రభుత్వం లక్షమని ఇన్ధుఒ భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి అధికారికంగా ఈ శిక్షణ తో ప్లేస్‌మెంట్స్ అందిస్తారు అని వారు పెరుకొన్నారు.అదే విధంగా సింగరేణి యాజమాన్య సహకారంతో స్థానిక యువతకు ఈ శిక్షణను ఉచితంగా అందజేస్తున్నారు అని తెలిపారు.ఇది సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని, కావున విద్యార్థులు సైతం ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి జీవితాలను ఉనతమైన మార్గంలో నడిపించుకుంటూ, తల్లిదండ్రులకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ కుమార్ , మున్సిపల్ కమిషనర్ రాజలింగు , టామ్ కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి, ఎంప్లాయిమెంట్ అధికారి రవికృష్ణ , టామ్ కామ్ మేనేజర్ అనిల్ కుమార్ , జర్మన్ భాషా బోధకుడు వైభవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మందమర్రిలో ముగిసిన ఉచిత యోగా శిక్షణ: విజేతలకు బహుమతుల ప్రదానం

siti news telangana

గనుల , డిపార్ట్మెంట్ ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా : ఎఐటియుసి యూనియన్

siti news telangana

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

siti news telangana