SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు : తప్పిన పెను ప్రమాదం.

ప్రాణా నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు..

కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ నుండి బెల్లంపల్లి బస్టాండ్ కు వెళ్తున్న క్రమంలో మందమర్రి జాతీయ రహదారి కేకే ఓసి వద్ద నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో కేవలం డ్రైవర్, ఓ ప్రయాణికుడు ఉండగా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. అదృష్ట శాతం ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై నరేష్ పేర్కొన్నారు.

Related posts

అధికారుల సంఘం ఆధ్వర్యంలో 5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు: మహిళా అధికారుల సంఘీభావం

siti news telangana

12 సీసీ కెమెరాలను ప్రారంభించిన డిసిపి భాస్కర్..

siti news telangana

నేషనల్ కరాటే, కుంఫు విజేతలకు ఘన సన్మానం : మందమర్రి

siti news telangana