SITI NEWS TELANGANA
క్రీడలు తెలంగాణ

డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడూదాము: మందమర్రి రన్నర్స్ టీం

తెలంగాణ రన్ లో పాల్గొన్న మందమర్రి రన్నర్స్…

యువత మంచి మార్గంలో నడుస్తూ తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలి..

ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించిన “తెలంగాణ రన్”లో ఆయన 10 కిలోమీటర్ల విభాగంలో పాల్గొని విజయవంతంగా గమ్యాన్ని చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి మందమర్రికి చెందిన సామాజిక ఉద్యమకారుడు గుడికందుల రమేష్‌ , జర్నలిస్ట్ ముడారపు అనిల్  రన్‌లో పాలుగోన్ని తమ ప్రతిభను కనబరిచారు .

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది రన్నర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా, యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని రమేష్ తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజూ రన్నింగ్ చేయాలని, రన్నింగ్ ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవడంతో పాటు మానసిక ఉత్సాహం కూడా పెరుగుతుందని అన్నారు……

వచ్చే మరికొన్ని నెలల్లో డగ్స్ కు వ్యతిరేకంగా మందమర్రి వేదికగా.. 100 కిలోమీటర్ల లాగ్ రన్ ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.. రన్నింగ్ పై ఆసక్తి ఉన్న వారికి మందమర్రి రన్నర్స్ టీం ఆధ్వర్యంలో గైడెన్స్ తోపాటు… భవిష్యత్ మారథాన్ లో పాల్గొనేందుకు కార్యాచరణ ప్రణాళిక అందజేస్తామని ఆయన తెలిపారు… ఆసక్తి ఉన్న వారు 8977779985 నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు…

Related posts

ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి మల్లు భట్టి విక్రమార్క

siti news telangana

విజయవంతంగా ముగిసిన పెన్ కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ పోటీలు

siti news telangana

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన..

siti news telangana