SITI NEWS TELANGANA
తెలంగాణ

సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం : మందమర్రి ఏరియా

శారీరక ధృడత్వం, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుంది :  జీఎం రాధాకృష్ణ…

మందమర్రి ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, సిబ్బంది ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు.”ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగ ” అనే నినాదంతో, నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏరియా జెనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ పేరుకొన్నారు.ఈ సందర్భంగా ఏరియాలోని గనులు, విభాగాలు(డిపార్ట్మెంట్లు) తో పాటు జీఎం కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సిబ్బంది కలిసి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు. నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే సింగరేణి ఉద్యోగులకు శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. నిత్య జీవితంలో భాగం చేసుకొని ప్రతి ఒక్కరూ రోజూ కనీసం కొద్ది సమయమైనా యోగా కోసం కేటాయించి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని పిలుపునిచ్చారు.కార్మికులు అలనే ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటేనే సంస్థ ప్రగతి పథంలో పయనిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయని జీఎం కార్యాలయ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ, యోగ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ.టు. జి.ఎం జి.ఎల్. ప్రసాద్,ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సి.ఎం.ఓ.ఏ ఐ జాయింట్ సెక్రటరీ రవి, డీజీఎం పర్సనల్ సిహెచ్.అశోక్, సీనియర్ పిఓ సత్యనారాయణ, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ గీతిక, యోగా మాస్టర్ ముల్కల. శంకర్, జిఎం కార్యాలయ ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

LIVE : Harish Rao’s Singareni Protection Meeting in Mancherial | Special PPT Presentation

siti news telangana

సామాన్యుడి బతుకు భారం.. వంటింట్లో మంట, జేబుకు చిల్లు

Web1Tech

గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పనులను శంకుస్థాపనకు రానున్న మంత్రులు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

siti news telangana