SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రిలో ఘనంగా సింగరేణి యాజమాన్యం – గుర్తింపు సంఘం ఏ.ఐ.టి.యు.సి19వ స్ట్రక్చర్ సమావేశం

జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌ లో 19వ స్ట్రక్చర్  సమావేశం.

సింగరేణి సంస్థ అభివృద్ధిలోనూ, ఉత్పత్తి ఉత్పాదకత సాధనలోనూ కార్మిక సంఘాల పాత్ర అత్యంత కీలకమైనదని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ అన్నారు.ఈ సందర్భంగా మందమర్రి ఏరియా లోని జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌ లో 19వ స్ట్రక్చర్ మీటింగ్ (నిర్మాణాత్మక సమావేశం) ని ఏర్పట్టు చేసారు.ఈ సమావేశంలో ఏ.ఐ.టి.యు.సి మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్,రామకృష్ణపూర్ సెక్రటరీ అక్బర్ అలీ ఇతర ముఖ్య నాయకులు పాల్గొని కార్మికుల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.యూనియన్ నాయకులు ప్రస్తావించిన సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందిస్తూ అర్హత కలిగిన అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికులు, సంఘాలు అందించిన సహకారం అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఇదే విధమైన సహమతితో ముందుకు సాగాలని జీఎం అన్నారు.ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఎస్.ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, కేకేఓసీ ప్రాజెక్ట్ అధికారి రాంబాబు, ఎస్కే గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (పర్సనల్) అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, ఏరియా వర్క్ షాప్ డీజీఎం (ఈ అండ్ ఎం) సురేష్, డీజీఎం (సివిల్) షేక్ మదీనా భాష, డీజీఎం ఏరియా స్టోర్స్, రవీందర్, హెచ్ ఓ డి (ఎస్ ఎన్ పి సి) వెంకటేశ్వర రెడ్డి, డి.వై.పి.ఎం విజయ్ సందీప్, సీనియర్ పి.ఓ కార్తీక్,​యూనియన్ నాయకులు కంది శ్రీనివాస్, జీఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సి.వి రమణ తో పాటు సీనియర్ అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అనర్హులా ? : బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

ప్రజల దాహార్తిని తీర్చిన ప్రజా నాయకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు : పొన్నారం గ్రామ ప్రజలు..

siti news telangana

సింగరేణి పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలి: టీబీజీకేఎస్ పిలుపు

siti news telangana