SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

బిఎల్ఎ -2(బూత్ లెవెల్ ఏజెంట్) సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నా మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలోని బి1 కార్యాలయం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్, భీమారం మండలం (నందనవనం),అలాగే చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయలలో బిఎల్ఎ -2(బూత్ లెవెల్ ఏజెంట్) సమీక్షా సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

      ఈ సందర్భంగా అయన మాట్లడుతూ కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు, ఓటర్ల జాబితా పక్కాగా ఉండేలా చూసుకోవడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల (బిఎల్ఎ) పాత్ర చాలా కీలకమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది బూత్ స్థాయి కార్యకర్తలేనని, కాబట్టి ప్రతి బూత్‌ను కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మార్చాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు.అదేవిధంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని పిలుపునిచారు.

 

Related posts

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

siti news telangana

పార్టీ బి.ఎల్.ఎ,శ్రేణులు లతో అవగాహన కార్యక్రమం : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

siti news telangana

మందమర్రి మోడల్ స్కూల్‌లో ‘తల్లిదండ్రుల హామీలు’అంశంపై ఘనంగా పి.టి.ఎం.

siti news telangana