SITI NEWS TELANGANA
క్రైమ్ స్థానిక వార్తలు

12 సీసీ కెమెరాలను ప్రారంభించిన డిసిపి భాస్కర్..

ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం..

మందమర్రి :
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కల గుట్ట గ్రామంలో నేరాల నియంత్రణ ప్రజల భద్రత శాంతిభద్రతల పరిరక్షణ అధ్యాయంగా నూతనంగా ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను శుక్రవారం మంచిర్యాల డిసిపి ఎగిడి భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై నిఘానేత్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో నేరాల అదుపుకు అసాంఘిక శక్తుల కదిలికపై నిఘ ఉంచడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరోధించడానికి, అలానే నేరాలు జరిగిన నిందితులను త్వరగా గుర్తించడానికి ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ శాంతిభద్రత పరిరక్షణలో భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు టెక్నాలజీ సహాయంతో నీరసహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి పి.కిరణ్ కుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రమేష్, రామకృష్ణాపూర్ ఎస్సై జె. శ్రీధర్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

మునీర్ స్ఫూర్తి తో సింగరేణిని పరిరక్షిస్తాం : కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్నికి సత్కారం : మంత్రి వివేక్ వెంకట స్వామి

siti news telangana

మందమర్రి సింగరేణి యోగ హాల్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

siti news telangana