SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మునీర్ స్ఫూర్తి తో సింగరేణిని పరిరక్షిస్తాం : కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి

కార్మికుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం…

కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి…

సింగరేణి సంస్థను పరిరక్షించే బాధ్యతను తాను,తమ ప్రభుత్వం తీసుకుంటుందని కార్మిక,గనుల శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి హామీ ఇచ్చారు.ఆదివారం మందమర్రిలో సీనియర్ జర్నలిస్ట్ మునీర్ పై రాసిన మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య ఆవిష్కర్తగా హాజరై ప్రసంగించారు. గతంలోసింగరేణి సంస్థ సిక్ ఇండస్ట్రీగా మారి బి.ఐ.ఎఫ్ ఆర్.పరిధిలోకి పోయినప్పుడు తన తండ్రి అయిన కాకా వెంకటస్వామి సింగరేణి కాపాడినాడన్నారు.ఆ కాలంలో మునీర్ తన వార్తల ద్వారా సంస్థ పరిరక్షణకు మార్గ నిర్దేశనం చేసినాడన్నారు.ఆ మునీర్ స్ఫూర్తితోనే సింగరేణి పరిరక్షణకు అందరమూ కలసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమంలో మునీర్ కృషి ఎంతగానో ఉందన్నారు.ఎంత నిక్కచ్చిగా వార్తలు రాసేవాడో అంటే నిఖార్సుగా మనుషుల పట్ల ప్రేమాభిమానాలతో ఉండేవాడన్నారు.మునీర్ పేరిట ప్రెస్ భవన్,ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన కోసం స్థలం కై సింగరేణి తో మాట్లాడుతానన్నారు.


మునీర్ కుటుంబం తో తమకున్న అనుభవాన్ని ఆయన నెమరువేసుకున్నాడు.మానవ హక్కుల పట్ల,కార్మిక పోరాటాల పట్ల అతని నిబద్ధత వెలకట్టలేనిదన్నారు.అతని కుటుంబానికి పెన్షన్ ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.
పవన్, మునీర్ జీవిత చరిత్ర చదువు.తెలంగాణ తత్వం బోధపడుతుంది.


-ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్
తెలంగాణ లో ఇల్లు కట్టుకుని ఉంటూ తెలంగాణ లోనే ప్రెస్ మీట్ పెట్టి “నన్ను తెలంగాణకు రానివ్వరా,మీ జాగీరా”అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీ.ఏం.పవన్ కళ్యాణ మాట్లాడటం హాస్యాస్పదమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.మునీర్ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ  పవన్ కు తెలంగాణ తత్వం బోధపడలేదన్నారు.మునీర్ పై రాసిన ఈ పుస్తకం చదివితే అర్థమవుతుందని ప్రకాశకులు ఒక పుస్తకాన్ని ఆయనకు పోస్ట్ చేయాలని సూచించారు.మునీర్ సమాజ ఉన్నతి కోసం జీవితాంతం కృషి చేశాడన్నారు.విద్యార్థికార్మిక నాయకుడిగా,జర్నలిస్ట్ గా,తెలంగాణ ఉద్యమకారునిగా ఆయన ప్రస్థానం ఈ సమాజం పై చెరగని ముద్ర వేసిందన్నారు.సింగరేణి కార్మికోద్యమాలల్లో అతను చురుకైన పాత్ర పోషించాడన్నారు.ఆయన జీవిత చరిత్రను అందరూ చదవాలని అన్నారు.ఈ పుస్తకం యాభై సంవత్సరాల కోల్బెల్ట్ ఉద్యమాల చరిత్రను రికార్డ్ చేసిందన్నారు.

సాహసిక జర్నలిస్ట్ మునీర్
సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి
మునీర్ సాహసికుడైన జర్నలిస్ట్ అని ప్రముఖ సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి కొనియాడారు.తాను సింగరేణిలో పనిచేసిన అనుభవం ఉందని,సింగరేణి ప్రాంత సమస్యలను బలంగా వినిపించిన వ్యక్తి మునీర్ అన్నారు.తెలంగాణ ఉద్యమ కాలంలో తాను హెచ్.ఎం.టివి తరఫున నిర్వహించిన దశ దిశ కార్యక్రమంలో మునీర్ సింగరేణిలో వివక్ష గురించి ఆద్భుతంగా వివరించారన్నారు.తెలంగాణ ప్రభుత్వ మాజీ విప్ నల్లాల ఓదెలు మాట్లాడుతూ మునీర్ సహచరున్ని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు.తన జీవితం లో మునీర్ సలహా లేకుండాముండదుగు వేయలేదన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ మినీ పోరాట స్ఫూర్తి గొప్పదని కొనియాడారు.తెలంగాణ నుంచి హైదరాబాద్ ను వేరు చేసే కుట్ర తయారవుతుందని దానిపట్ల అందరూ అప్రమత్తత తో ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఆ కుట్రను ఎదుర్కొనడానికి తిరిగి ఉద్యమించడానికి సన్నద్ధం కావాలన్నారు.
నిత్యం ప్రజల గురించి ఆలోచించే మనిషి మునీర్ అని జనం సాక్షి సంపాదకులు రహమాన్ అన్నారు.విస్తృతంగా అనేక సమస్యలపై వార్తాకథనాలు రాసినాడన్నారు.మునీర్ మానవతావాది మాత్రమే కాకుండా పీడితుల పక్షాన నిలిచిన వ్యక్తి అన్నారు .పుస్తక సంపాదకుడు మాదాసి రామ్మూర్తి మాట్లాడుతూ సింగరేణి ఉద్యమాలనుండి మునీర్ ను విడదీసి చూడలేమన్నారు.ప్రతీ సామాజిక ఉద్యమంలో మునీర్ తనదైన,చురుకైన పాత్ర పోషించాడన్నారు.సహా సంపాదకుడు వెంకట రావు మాట్లాడుతూ మునీర్ ఒక ఫినామినా అని అభివర్ణించారు. సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య,కేంగర్లమల్లయ్య,గురజాల రవీందర్ రావు,హెచ్.రవీందర్ లు మాట్లాడగా చందర్ అధ్యక్షత వహించారు.

Related posts

లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హామీ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

siti news telangana

పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

siti news telangana