SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ప్రాణాపాయ స్థితిలో మిత్రుడు. దాతల సహాయం కోసం వేడుకుంటున్న విద్యార్థులు.

• మిత్రుడి ప్రాణాల కోసం విద్యార్థుల పోరాటం..

• మేడారం సమీపంలో ప్రమాదానికి గురైన రాజ్‌కుమార్‌కు చికిత్స కోసం   రూ.3లక్షల అవసరం..

• దాతల సహాయం కోసం వేడుకోలు..

మందమర్రి :

స్నేహం అంటే కేవలం ఆనందాన్ని పంచుకోవడమే కాదు.. ఆపదలో అండగా నిలవడమని కొందరు విద్యార్థులు మరోసారి నిరూపించారు. అనుకోని రోడ్డు ప్రమాదం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ సహ విద్యార్థి కోసం వారు ఒక్కటై సహాయం కోసం ముందుకొచ్చారు. తాము చేయగలిగినంత ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, సమాజంలోని దాతలను కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మందమర్రి మండల పరిధిలోని బొగ్గలగుట్ట సమీపంలో జాతీయ రహదారి పై  జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో మిరియాల రాజ్‌కుమార్ (పండు) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో తలకు, శరీరంలోని పలు గాలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మంచిర్యాల  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో  వైద్యులు ప్రత్యేక వైద్యం కోసం కరీంనగర్‌లోని హాస్పిటల్ కి తరలించారు. పరిక్షలు నిర్వహించిన అంతరం చికిత్స కోసం సుమారు రూ.3 లక్షలు అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే నిరుపేద కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం భారంగా మారింది. దీంతో రాజ్‌కుమార్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు దాతల సహాయం కోసం వేడుకుంటున్నారు.

స్తానిక ప్రభుత్వ కళాశాల లో చడుతున్న విద్యార్థులు తమ మిత్రుడు తిరిగి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారు విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. తమకు చేతనైనంత సహాయం చేస్తూనే, మరింత మంది దాతలు స్పందించాలని  విజ్ఞప్తి చేస్తున్నారు. “ఒక్కో రూపాయి ఒక్కో ప్రాణానికి అండగా నిలవొచ్చు” అంటూ వారు  చేస్తున్న పిలుపు, మానవత్వానికి అద్దం పట్టే ఈ ఘటన పలువురి హృదయాలను కదిలిస్తోంది.

సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని నమ్ముతూ, రాజ్‌కుమార్ చికిత్సకు ఆర్థికంగా చేయూతనివ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమయానికి అవసరమైన చికిత్స అందితే ఆయన కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సహాయం అందించదలచిన దాతలు ఫోన్‌పే / గూగుల్ పే  నంబర్: 8374554823 ద్వారా తమ వంతు సహాయం అందించి, చిన్న సహాయం కూడా ఒక కుటుంబానికి ఆశాకిరణంగా మారవచ్చు అని వేడుకుంటున్నారు.

Related posts

మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన..

siti news telangana

భిన్నత్వంలో ఏకత్వానికి అద్దంగా : మొహర్రం వేడుకలు..

siti news telangana

రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత : పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్

siti news telangana