SITI NEWS TELANGANA
లైఫ్ స్టైల్ స్థానిక వార్తలు

మందమర్రి సింగరేణి యోగ హాల్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మందమర్రి:

గురు పౌర్ణమి సందర్భంగా మందమర్రి సింగరేణి యోగ హాల్‌లో గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని చాటుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదవ్యాస మహర్షి, పతంజలి మహర్షి, సూర్య భగవానునికి పూలమాలలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలను వేద పండితులు అనంత ఆచారి నిర్వహించారు.

అనంతరం యోగా ప్రారంభం నుంచి శిక్షణ అందించిన గురువులు నగేష్ , శంకర్ మాస్టర్, బర్ల సదానందం, కొంపల్లి రమేష్‌తో పాటు స్థానికంగా సేవలందిస్తున్న ఇతర యోగా గురువులందరినీ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గురువుల మార్గదర్శకత్వం సమాజానికి ఎంతో అవసరమని, యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు శానవాజ్సార్, ఆయుష్ టీచర్లు శైలజ ,రామ్మోహన్ గార్లు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సూర్య నమస్కారాల మద్ది శంకర్ ,గవర్నర్ అవార్డు గ్రహీత వెంకటేష్, సీనియర్ యోగ సభ్యులు గంప అనిల్ దంపతులు శ్రీనివాస్, మచ్చయ్య మహిళా యోగ సభ్యులు సీనియర్ సిటిజన్ యోగ సాధకులు పాల్గొన్నారు.

Related posts

మందమర్రిలో ఘనంగా సింగరేణి యాజమాన్యం – గుర్తింపు సంఘం ఏ.ఐ.టి.యు.సి19వ స్ట్రక్చర్ సమావేశం

siti news telangana

రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత : పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్

siti news telangana

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్నికి సత్కారం : మంత్రి వివేక్ వెంకట స్వామి

siti news telangana