SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

50 % సబ్సిడీ పై అందుబాటులోకి జీలుగ విత్తనాలు : మండల వ్యవసాయ అధికారి జి.కిరణ్మయి

50 % సబ్సిడీ పై అందుబాటులోకి జీలుగ విత్తనాలు 

మందమర్రి మండలంలోని రైతులకు జీలుగ విత్తనాలు 50% సబ్సిడీ పై అందుబాటులోకి వచ్చినట్లు మండల
వ్యవసాయ అధికారి జి.కిరణ్మయి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లడుతూ వ్యవసాయ శాఖ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) లో 25క్వింటాళ్ల (83 బ్యాగులు) మందమర్రి ఆగ్రోస్ లో 25 క్వింటాళ్ళు (83 బ్యాగులు) సిద్ధంగా ఉన్నయి అన్ని . మండలంలో మొత్తం 50 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అందుబాటులో ఉంచబడ్డాయి అని , అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, వివరాలతో తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) అలానే మండల వ్యవసాయ అధికారి (AO)ని సంప్రదించాలని తెలిపారు . విత్తనాల పంపిణీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించబడుతుంది. ఒక బ్యాగ్ (2.20)రెండున్నర ఎకరాలు (ఒక హెక్టార్ ) కి సరిపోతుంది.
సబ్సిడీ వివరాలు :
(ఒక బ్యాగుకు – 30 కేజీలు) బ్యాగ్ పూర్తి ధర | రూ. 4,905.00 |
ప్రభుత్వ సబ్సిడీ (50%) | రూ.2,452.50 |
రైతు చెల్లించాల్సిన నికర ధర|  రూ. 2,452.50.
కావున రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .

Related posts

గనులు,డిపార్ట్‌మెంట్ల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు

siti news telangana

అర్పిఐ(అత వాలే) మంచిర్యాల జిల్లా పాత కమిటిని రద్దు : నూతన అధ్యక్షుడిగా దూడం. తిరుపతి

siti news telangana

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు హర్షనీయం: సీఎం, మంత్రి, ఎంపీ చిత్రపటాలకు సింగరేణి కార్మికుల క్షీరాభిషేకం

siti news telangana