SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రిలో ముగిసిన ఉచిత యోగా శిక్షణ: విజేతలకు బహుమతుల ప్రదానం

యోగ సాధన ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం

“యోగ సాధన ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది” అని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
మందమర్రి మండల పరిధిలోని ఊరు మందమర్రిలోని రామాలయం సమీపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత
కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ శిక్షణా శిబిరంలో స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు నేర్చుకున్నారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సొత్తుకు సుదర్శన్, పుస్కూరి నర్సింగరావు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని, నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలను యోగా ద్వారా నివారించవచ్చని పేర్కొన్నారు. యోగ మాస్టర్ మీనాక్షి ఆధ్వర్యంలో శిక్షులకు యోగాసనాలతో పాటు పిరమిడ్ ధ్యానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా , శిబిరంలో క్రమం తప్పకుండా పాల్గొని, యోగాసనాల ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి లయన్స్ క్లబ్ వారు  ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, యోగా సాధకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్లు కొంపెల్లి లలిత, మీనాక్షి, లైన్స్ క్లబ్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, తాడికొండ లూథర్ భూపాల్, బింగి రాజన్న,ఆలయ పూజారి,తదితరులు, పాల్గొన్నారు.

Related posts

ప్రాణాపాయ స్థితిలో మిత్రుడు. దాతల సహాయం కోసం వేడుకుంటున్న విద్యార్థులు.

siti news telangana

అర్పిఐ(అత వాలే) మంచిర్యాల జిల్లా పాత కమిటిని రద్దు : నూతన అధ్యక్షుడిగా దూడం. తిరుపతి

siti news telangana

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొంది నివాసం ఉండని వారికి అధికారుల సూచనా… స్పందించకుంటే కేటాయింపులు రద్దు!

siti news telangana