SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం లో దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆధ్వర్యంలో వార్డు నెం. 1 – దుర్గామాత షెడ్ సమీపం, యాపల్.వార్డు నెం. 2 –శ్రీరామ గ్రౌండ్ సమీపం, యాపల్.వార్డు నెం. 3 – అయ్యప్ప దేవాలయం సమీపం, వాటర్ ట్యాంక్ వద్ద. వార్డు నెం. 4 – కమ్యూనిటీ హాల్ సమీపం, షిర్కెట్.వార్డు నెం. 5 – ట్యాంక్ సమీపం, ఆర్కే-1, సుభాష్నగర్. వార్డు నెం. 6 – యూపీఎస్ పాఠశాల సమీపం, రామకృష్ణాపూర్ గ్రామం,యూపీఎస్ పాఠశాల, నర్లాపూర్ లలో నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి
నివేదికతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్టు పెరుకొన్నారు . అలాగే వర్షాకాల సన్నద్ధత చర్యలపై ప్రత్యేకంగా అవగాహన కలిపించామన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ పి. కృష్ణప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి. వసంత్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. గోపీకృష్ణ, సిస్టమ్ మేనేజర్ ఏ. శిరీష్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బి. శ్యాంబాబు, వార్డు అధికారులు, స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Related posts

పచ్చని భవిష్యత్తు కోసం మందమర్రి ఏరియాలో ఘనంగా మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్

siti news telangana

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం : జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

siti news telangana

మందమర్రి కోర్టు నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ నిర్మల

siti news telangana