మందమర్రి ఏరియా KK-5 గని , ఏరియా వర్క్ షాప్ లలో ఎఐటియుసి యూనియన్ ల ఆధ్వర్యంలో స్థానిక ఘనుల , డిపార్ట్మెంట్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాని చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ ,ఉపదేక్షులు భీమనధుని సుదర్శన్ ,పిట్ సెక్రెటరీ సిహెచ్ పి శర్మ లు మాట్లడుతూ గనుల పైన సేఫ్టికి సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై లేకపోవడం వలన కార్మికుల ఇబ్బందులకు గురి అవుతున్నారు, కోల్ బిట్లు, డ్రిల్ రాడ్స్, సపోర్ట్ సేఫ్టీ మెటీరియల్ సప్లై చేయడం లేదు, నాణ్యమైన బిట్లు రాడ్లు, లేకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు, ప్రొడక్షన్ కు అంతరాయం ఏర్పడుతుంది, అదేవిధంగా ఎస్ డి ఎల్ యంత్రాలు వాటి కాలపరిమితి అయిపోయినవి, కొత్త SDL యంత్రాలు కొనుగోలు చేయాలి, అదేవిధంగా వర్క్ షాప్ లో, ఫిట్టర్ లు, ఎలక్ట్రిషన్స్, సబ్ సెంటు లేకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి . కావున ఆ ఖాళీలను చేయాలి, వర్క్ షాప్ లోని మిషినిస్ట్ సెక్షన్ లో కొత్త మిషన్లను కొనుగోలు చేసి సరియైన టూల్స్ ను ఇవ్వాలి, సేఫ్టీ గ్లౌజెస్ ని కూడా ఇవ్వడం లేదు, కాలనీలలో వర్షాకాలం వస్తున్న సందర్భంగా సరియైన స్ట్రీట్ లైట్లు లేక క్రిములు కీటకాల వల్ల ఇబ్బంది జరిగే ప్రమాదముంది కనుక తక్షణమే కాలనీలలో సరిపోయే స్ట్రీట్ లైట్లు ఏయవలెను, అదేవిధంగా క్వార్ లోకి ఇచ్చే సర్వీస్ వైరు కేబుల్ కాలపరిమితి అయిపోయినది కావున తక్షణమే నూతన సర్వీస్ వైర్లను ఏర్పాటు చేయాలి, అలానే జూన్ మాసంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికుల పెండింగ్ సమస్యలపై జరగబోయే సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలనీ పిలుపునిచారు.
ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు ఏరియా నాయకులు, పెద్దపెల్లి బానయ్య, ఏగ్గేటి. రాజేశ్వరరావు, పిట్టు స్థాయి నాయకులు ప్రేమ్ లాల్, రాంబాబు, శివాజీ శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, కె రాజయ్య యాదవ్, ఓ .శ్రీకాంత్, సిద్ధిని శ్రీనివాస్, బైరి పోషాలు, దుర్గాప్రసాద్, అన్వేష్,సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీ,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్, తోట వెంకటస్వామి, బత్తుల రామన్న, భగవాన్ రెడ్డి, తదితరులు కార్మిక సోదరులు పాలుగోన్నారు.
