SITI NEWS TELANGANA
తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వార తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల : మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ యువతను ప్రపంచ ఉద్యోగ విపణికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాత ఐటీఐలకు సరికొత్త రూపు కల్పించి వాటిని అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేసిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి  తెలిపారు. ఈ కేంద్రాలు కేవలం శిక్షణా సంస్థలు మాత్రమే కాకుండా, రాష్ట్ర యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ అవకాశాల వేదికలుగా మారుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మల్లేపల్లిలోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ను మీడియా ప్రతినిధులతో కలిసి సందర్శించిన అనంతరం మంత్రి మాట్లడుతూ  శిక్షణ పొందుతున్న విద్యార్థులు, ట్రైనర్లు అక్కడ అందుబాటులో ఉన్న ఆధునిక సదుపాయాలు, నేర్చుకుంటున్న సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించి వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL) భాగస్వామ్యంతో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి రంగాన్ని బలోపేతం చేసేందుకు సుమారు రూ.40,000 కోట్ల పెట్టుబడులను సమీకరించిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తోందని, యువతకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు యువతకు ఒక సువర్ణావకాశమని పేర్కొన్న మంత్రి, విద్యార్థులు ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతోనే జీవితంలో విజయం సాధించవచ్చని అన్నారు.
“రాష్ట్ర యువత భవిష్యత్ ఉపాధి అవకాశాలకు ఈ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు పునాది వేస్తున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేస్తున్నాయి” అని మంత్రి పేర్కొన్నారు.


ఐటీఐల భౌతిక వసతుల అభివృద్ధితో పాటు ట్రైనర్లకు కూడా వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, తద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను తయారు చేయడంలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, తెలంగాణను దేశంలోనే అగ్రగామి స్కిల్ డెవలప్‌మెంట్ హబ్‌గా నిలబెడతాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

Related posts

వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసేందుకు ముగ్గు చూపాలి

siti news telangana

అమెరికా లో చదువుతున్న తెలంగాణ విద్యార్థినికి ఘోర ప్రమాదం

siti news telangana

తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

Web1Tech