SITI NEWS TELANGANA
తెలంగాణ

పేదింటి ఆత్మగౌరవానికి చిరునామా ఇందిరమ్మ ఇల్లు : గృహ నిర్మాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పేదల సొంతింటి కల సహకారం అవుతున్న బృహత్తర కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా గర్వపడుతున్నాను…

అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం…

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన చివరి ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజా దర్బార్ కు వచ్చిన ఆయా వార్డుల ప్రజల నుంచి మంత్రి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు.

అధికారులు కూడా ప్రజా కోణంలో ఆలోచించి సత్వర పరిష్కారాన్ని అందించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , మున్సిపల్ చైర్ పర్సన్ , మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఆయా శాఖల సంబంధిత అధికారులు మరియు పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Related posts

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు : సింగరేణి పరిరక్షణ సదస్సు

siti news telangana

కార్మిక క్షేత్ర పరిసర ప్రాంతాల యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించడమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana

కేకే-1 డిస్పెన్సరీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు : మందమర్రి ఏరియా

siti news telangana