SITI NEWS TELANGANA
తెలంగాణ స్థానిక వార్తలు

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

సింగరేణి సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, IAS ప్రత్యేక ఆదేశాలు తో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ (జీ.ఎం) కార్యాలయంతో పాటు కేకే ఓసీపీ (KK OCP) లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ముందుగా జీఎం కార్యాలయంలో అధికారులు, కార్మికులు ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టారు.అనతరం కేకే ఓసీపీ అధికారులు, సూపర్‌వైజర్లు, క్లరికల్ సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు, సహా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని,మొక్కలను నట్టుతూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని సంకల్పం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ జీ.ఎం జి.ఎల్. ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఎన్దుఒ భాగంగా సీ.ఎండీ దిశానిర్దేశంలో సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణాన్ని
రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యోగిపై ఉందన్నారు.అలనే సింగరేణిని పర్యావరణహిత సంస్థగా తిర్చిదిడ్డుతూ, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే ప్రతి ఒక్కరి బాధ్యతని పెరుకొన్నారు.

ఈ కార్యక్రమాల్లో అధికారుల సంఘ నాయకులూ రమేష్ ,ఏరియా పర్యావరణ అధికారి వెంకటరెడ్డి , శ్రీధర్ గౌడ్ , సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ,డిప్యూటీ ఎఫ్.ఎమ్ అకౌంట్స్ సరిత ,కేకే ఓసీపీ ప్రాజెక్ట్ ఇంజనీర్ వెంకటవంశీధర్ , మేనేజర్ రామరాజు , వెల్ఫేర్ ఆఫీసర్ సందీప్,ఏఐటీయూసీ జీ.ఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ రమణ ,జీ.ఎం ఆఫీస్ పిట్ సెక్రటరీ గీతిక తో పాటు కార్మికులు , కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాలుగోన్నారు.

 

Related posts

సామాన్యుడి బతుకు భారం.. వంటింట్లో మంట, జేబుకు చిల్లు

Web1Tech

12 సీసీ కెమెరాలను ప్రారంభించిన డిసిపి భాస్కర్..

siti news telangana

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండించిన : రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల.శ్రీనివాస్

siti news telangana