SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అత్యంత వైభవంగా మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం..

పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మందమర్రి ఆధ్వర్యంలో 15వ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు బాధ్యతలను స్వీకరించారు.ముఖ్య అతిథి,పదవీ బాధ్యతల స్వీకరణ అధికారి రిక్కల.నారాయణ రెడ్డి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు లయన్ పెండ్యాల గౌతం చారి,కార్యదర్శి లయన్ ఎం.డి. జాకీర్, కోశాధికారి లయన్ బుర్ర ఆంజనేయులు తో లయన్స్ క్లబ్ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లబ్ ద్వారా మందమర్రి పట్టణంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు.అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ సోతుకు సుదర్శన్, కో- చైర్ పర్సన్ లయన్ పోలు.శ్రీనివాస్,లయన్ తౌటం.శ్రీనివాస్, లయన్ అర్శావెల్లి.శ్రీనివాస్, లయన్ కొక్కుల.మధు, పసుల. వెంకటరత్నం, లయన్ చిదురాల.సతీష్, లయన్ అనిత, లయన్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సింగరేణి పరిరక్షణ సదస్సు ను విజయవంతం చేయండి : టిబిజికేఎస్

siti news telangana

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో మార్నింగ్ వాక్ : మంత్రి వివేక్

siti news telangana

అధికారుల సంఘం ఆధ్వర్యంలో 5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు: మహిళా అధికారుల సంఘీభావం

siti news telangana