SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు : మందమర్రి ఏరియా

సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న పలువురు
ఉన్నతాధికారులను మంగళవారం ఏరియా జీ.ఎం ఎన్. రాధాకృష్ణ అన్ని విభాగాల అధికారుల ఆధ్వర్యంలో
ఘనంగా వీడ్కోలు , సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా
సేవలందించి, రామగుండం ఏరియాకు జీఎం (సేఫ్టీ) గా పదోన్నతితో బదిలీపై వెళ్తున్న మల్లయ్యను, అలాగే
ఏరియా సీనియర్ పర్సనల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించి, భూపాలపల్లి ఏరియాకు బదిలీ అయిన వంశీని శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

అనతరం ఏరియా జీ.ఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ మందమర్రి ఏరియా అభివృద్ధిలో, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో బదిలీపై వెళ్తున్న అధికారులు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వారి వారి నూతన బాధ్యతల్లో కూడా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయనఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం జి.ఎల్. ప్రసాద్, నూతన కేకేఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు,కే.కే గ్రూప్ ఏజెంట్ ఖదీర్ తో పాటు ఏరియాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

siti news telangana

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

siti news telangana

మందమర్రి సింగరేణి పాఠశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

siti news telangana