ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం…
వృద్ధాప్యంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని ఆయుష్ యోగా టీచర్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి మున్సిపల్ కార్యాలయంలోని ఆయుర్వేద ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నీరజ , ఆయుష్ యోగా టీచర్లు శైలజ , జి.రామ్మోహన్ ఆధ్వర్యంలో “యోగా ఫర్ హెల్తీ ఏజింగ్” (ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా) అనే నినాదంతో ప్రత్యేక అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు , వ్యాపార సంఘం అధ్యక్షులు వడ్లకొండ కనకయ్య పాల్గొన్నారు.అంతరం మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డాక్టర్ నీరజ,యోగా టీచర్లు కొంపెల్లి రమేష్, బర్ల సదానందం లు మాట్లాడుతూ వృద్ధాప్యంలో సంక్రమించే వివిధ రకాల (కీళ్ల నొప్పులు, రక్తపోటు ,మధుమేహం, గుండెపోటు ) వంటి వ్యాధులు యోగా చేయడం ద్వారా ఎలా నియంత్రణతో
తగ్గించుకోవచ్చు అనే శాస్త్రీయ వివరణ ద్వారా తెలియజేశారు.సాత్విక ఆహారం చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామం , ధ్యానం చేయడం ద్వారా ఎలా శరీరం లోని గ్లాండ్స్ ప్రభావితం , ఆరోగ్యవంతం అవుతుందనేది తెలిపారు . ఈ కార్యక్రమంలో యోగ సభ్యులు గుండెబోయిన సారయ్య , పోలు సంపత్, వ్యాపార సంఘం
కమిటీ సబ్యులు తిరుమలేష్ ,బండ ప్రసాద్ , లారీ అసోసియేషన్ అద్యక్షులు ఓం ప్రకాష్, పిరమిడ్ మాస్టర్స్ కొంపల్లి లత, సువర్ణ తదితర ధ్యాన సభ్యులు, ఆశా సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
