SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

పార్టీ బి.ఎల్.ఎ,శ్రేణులు లతో అవగాహన కార్యక్రమం : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

మీ ఓటు-మీ హక్కు: పార్టీ శ్రేణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని బి ఆర్ ఎస్ జిల్లా అద్యాక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ‘మీ ఓటు మీ హక్కు’ అనే నినాదంతో బి.ఎల్.ఎ లు, పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన  ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా యువత ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి ఓటింగ్ శాతం పెరగడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలపై స్థానిక ప్రజలకు నాయకులు అండగా నిలవాలని సూచించారు.ఓటు హక్కు కేవలం బాధ్యత మాత్రమే కాదు, సమాజ మార్పునకు ఒక మంచి అవకాశం అని బాల్క సుమన్ అన్నారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బి.ఆర్.ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు పాల్గొనారు.

Related posts

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో 100 మొక్కల నాటిన సిబంది.

siti news telangana

మందమర్రిలో 300 గజాలకుపైగా స్థలాలు కలిగిన భవనాలకు వర్షపు నీటి సంరక్షణ గుంతలు తప్పనిసరి..

siti news telangana

మందమర్రి మోడల్ స్కూల్‌లో ‘తల్లిదండ్రుల హామీలు’అంశంపై ఘనంగా పి.టి.ఎం.

siti news telangana