SITI NEWS TELANGANA
తెలంగాణ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు : సింగరేణి పరిరక్షణ సదస్సు

సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు …

సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, కార్మిక వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సింగరేణి సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు ప్రత్యేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కూలక్షంగా వివరించారు. అలనే కేంద్ర ప్రభుత్వం సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను కమర్షియల్ మైనింగ్ పేరిట ప్రైవేట్ పరంచేయాలని చూస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.  సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిది. దాన్ని ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వం అని స్పష్టం చేశారు.డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో, కార్మికుల వారసత్వ ఉద్యోగాల హక్కుల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ప్రయోజనాలను కేంద్రం వద్ద సరైన రీతిలో కాపాడటంలో విఫలమవుతోందని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని లాభాల బాటలో నడిపించిందని, కార్మికులకు భారీగా బోనస్‌లు అందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.అలాగే సింగరేణి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కార్మికులు, యూనియన్లు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే సింగరేణి పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.సింగరేణి ప్రాంతంలో పట్టు సాధించేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ , బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు అదేవిధంగా రాజకీయాలపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వేక్తం చేస్తున్నారు.

Related posts

కార్మిక క్షేత్ర పరిసర ప్రాంతాల యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించడమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana

సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం : మందమర్రి ఏరియా

siti news telangana

LIVE : Harish Rao’s Singareni Protection Meeting in Mancherial | Special PPT Presentation

siti news telangana