SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో 100 మొక్కల నాటిన సిబంది.

ఒక మొక్క నాటితే భవిష్యత్ తరాలకు ఊపిరి పోసినట్లేనని పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,ఇందులో భాగంగా మొక్కలను నాటి ప్రకృతిని కాపాడి రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ రాజలింగు, కార్మికులు, సిబంది తో కలిసి 100 మొక్కలను నాటారు.తదంతరం అయన మాట్లాడుతూ ప్రాణుల మనుగడకు ప్రకృతే ఆధారమని ,పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యం పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారాయని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అడవుల నరికివేతను అడ్డుకుని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు .

ప్రకృతిని ప్రేమించండి – పర్యావరణాన్ని రక్షించండి అని  ప్రకృతి మనం చేసిన మేలును మనకు వంద రెట్లు తిరిగి అందిస్తుంది.మన కోసం మాత్రమే కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలి.చెయ్యి చెయ్యి కలిపి పచ్చని సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ పి. కృష్ణ ప్రసాద్, మేనేజర్ టి. రాజేశ్వరి, టి.పి.బి.ఓలు మనోజ్, సాయి నిఖిల్, రాజ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఏ. రాణి,ఈ. రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్లు ఈ. వసంత్, విమల రాణి, పున్నం చందర్, బి. ప్రదీప్, వినయ్ శామ్యుల్, సి.హెచ్. ప్రదీప్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. గోపి కృష్ణ, సిస్టమ్ మేనేజర్ ఎ. శిరీష్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బి. శ్యాంబాబు,వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

siti news telangana

అర్పిఐ(అత వాలే) మంచిర్యాల జిల్లా పాత కమిటిని రద్దు : నూతన అధ్యక్షుడిగా దూడం. తిరుపతి

siti news telangana

హోరాహోరీగా మందమర్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు: అధ్యక్షుడిగా జి. రామచందర్ ఘన విజయం

siti news telangana