SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

గనులు,డిపార్ట్‌మెంట్ల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు

కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.. అధికారులకు వినతి పత్రాల సమర్పణ…

సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏరియా పరిధిలోని పలు బొగ్గు గనులు, వివిధ డిపార్ట్‌మెంట్ల వద్ద కార్మికులు తో కలిసి దర్నలు చేశారు.

కార్మికుల హక్కులను కాపాడటంలో మరియు వారి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అలానే సింగరేణి సంస్థలో రాజకీయ నాయకుల జోక్యం మితిమీరిపోతోందని, దీనివల్ల కార్మికుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.అలాగే గనులు, కార్యాలయాల పరిధిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన అనంతరం, సమస్యలతో కూడిన వినతి పత్రాలనుసంబంధిత అధికారులకు అందజేశారు.కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగేది లేదని, యాజమాన్యం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ హెచ్చరించింది.ఈ నిరసన కార్యక్రమాల్లో ఏఐటీయూసీ ముఖ్య నాయకులు, గని కమిటీ సభ్యులు,పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.

Related posts

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు హర్షనీయం: సీఎం, మంత్రి, ఎంపీ చిత్రపటాలకు సింగరేణి కార్మికుల క్షీరాభిషేకం

siti news telangana

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

siti news telangana

12 సీసీ కెమెరాలను ప్రారంభించిన డిసిపి భాస్కర్..

siti news telangana