తాడిచర్ల-2′ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం..
రామకృష్ణాపూర్:
సింగరేణి సంస్థకు ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బ్లాక్ కేటాయింపు కోసం విశేషంగా కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల.రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం.వంశీకృష్ణలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రామకృష్ణాపూర్ (ఆర్కేపీ) సీహెచ్‌పీ లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, సింగరేణి కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి,మంత్రి,ఎంపీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ, ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణికి బొగ్గు బ్లాక్‌లను వేలం ద్వారా కాకుండా నేరుగా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, వారి నిరంతర శ్రమ ఫలితంగానే ‘తాడిచర్ల-2’ బ్లాక్ సింగరేణికి దక్కిందని పేర్కొన్నారు. సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ బ్లాక్ ద్వారా సింగరేణి ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.అదేవిధంగా ఎన్నికల సమయంలో సింగరేణిని కాపాడుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ నిలబెట్టుకున్నారని కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను అడ్డుకుని సింగరేణికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు స్పష్టం చేశారు.అలనే సింగరేణి సంస్థ మనుగడ కోసం, కార్మికుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎండి.అజిద్, గాండ్ల.సమ్మయ్య, జిల్లా కార్యదర్శి మహంకాళి. శ్రీనివాస్, గోపతి.బానేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల.వేణు, కార్మికులు చిలుకల.మధు, కాంపల్లి. నరసయ్య, రాజేష్, నల్లగొండ.నర్సింగం గౌడ్, ముస్తఫా, పత్తి.రాజిరెడ్డి, రాపోలు.శ్రీనివాస్, ముడిమడుగుల. మనోహర్, అనిత.లావణ్య, వీరస్వామి తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.
