SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మందమర్రి మోడల్ స్కూల్‌లో ‘తల్లిదండ్రుల హామీలు’అంశంపై ఘనంగా పి.టి.ఎం.

మందమర్రి :

తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల, మందమర్రిలో “తల్లిదండ్రుల హామీలు ( ‘పేరెంట్స్ – ప్రోమిసేస్’ )”అనే అంశంపై తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పిల్లల విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆరోగ్యం, సమయపాలన, డిజిటల్ పరికరాల వినియోగంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అలానే ఈ సమావేశంలో తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా పురోగతి,హాజరు, ప్రవర్తన, ప్రతిభ గురించి ఉపాధ్యాయులతో చర్చించి పలు సూచనలు స్వీకరించారు. అనంతరం విద్యార్థుల అభివృద్ధికి సహకరిస్తూ వారికి నైతిక విలువలు, క్రమశిక్షణ, క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించడం, ఇంటి వద్ద చదువుకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి అంశాలపై చేర్చించారు.అలానే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల–తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని , పాఠశాల అభివృద్ధి , విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిరంతరం సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాలుగోన్నారు.

Related posts

నేషనల్ కరాటే, కుంఫు విజేతలకు ఘన సన్మానం : మందమర్రి

siti news telangana

మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన..

siti news telangana

అధిక సాంద్రత సాగుపై రైతులకు అవగాహన : రైతు వేదికలో విత్తనాల పంపిణీ

siti news telangana