SITI NEWS TELANGANA
క్రైమ్

గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం

మందమర్రి మండల పరిధిలోని సారంగపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది . శుక్రవారం ఉదయం పశువుల కాపరి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అదే విధంగా పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు.మృతుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, మృతికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది అని , మృతుడి వయస్సు సుమారు 35 నుండి 40 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్సై నరేష్ పేర్కొన్నారు.

Related posts

ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో 3డీ యానిమేటెడ్ పోలీసు పెట్రోలింగ్ వాహన నమూనాల ఏర్పాటు : సుల్తానాబాద్‌

siti news telangana

నకిలీ పత్తి విత్తనాల రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్ సీజ్

siti news telangana

మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత : ముగ్గురు నిందితుల అరెస్ట్

siti news telangana