రైతులు దళారులను నమ్మి మోసపోవదు
మందమర్రి :
నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఎక్కడైనా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఎస్సై నరేష్ అన్నారు.ఇందులో భాగంగా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలొని స్థానిక పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా , భారీగా తరలిస్తున్న ప్రభుత్వ అనుమతులు లేని, నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని, ముగ్గురు నిందితుల అరెస్ట్ చూపించారు.
ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు, మండల వ్యవసాయ అధికారిని కిరణమై సంయుక్తంగా వాహన్ తనిఖీలు చేపడుతున్న సమయంలో అనుమానస్పదంగా రెండు ద్విచేక్ర వాహనాలపై వెళ్తున్న వ్యక్తులను ఆపి విచారించగా నకిలీ పత్తి విత్తనాల రవాణా బయటపదిందని, ఎటువంటి స్టడీ ఫైట్ లేబుల్,బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.అలానే రైతులు సైతం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి,దళారులను నమ్మి మోసపోవస్ధాన్ని ఎస్సై కోరారు.నకిలీ పత్తి విత్తనాల రవాణాను అడ్డుకొని చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్న మందమర్రి ఎస్సై నరేష్ ,పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రాకేష్, చైతన్య, మహేందర్, సంతోష్ లను ఉన్నతాధికారులు అభినందించారు.
