SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం : డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి

కేసీఆర్,కేటీఆర్ మెప్పు కోసం అసత్యపు ఆరోపణలు…

సింగరేణి సంస్థను ఏటీఎం లాగా వాడుకున్న చరిత్ర బిఆర్ఎస్ దే… 

మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టి (డీసీసీ) అధ్యక్షులు పిన్నింటి రఘునాథరెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మందమర్రి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. పదవి పోయిందనే ఫ్రస్ట్రేషన్‌లో బాల్క సుమన్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.సుమన్ ఓటమి నీ తట్టుకోలేకనే కేసీఆర్,కేటీఆర్ మెప్పు కోసం అసత్యపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు.తెలంగాణ సెంటిమెంట్ తో చెన్నూరు,పెద్దపల్లి ప్రజలు టీఆర్ఎస్ ఎంపీ,ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈప్రాంత అభివృద్ధికి పాటుపడకుండా ఇసుక దందా,భూ కబ్జాలు చేస్తూ రౌడీ లాగా వ్యవహరించిన నీ తీరును ఈ ప్రాంత ప్రజలు కార్మికులు ఇంకా మర్చిపోలేదనీ అన్నారు.అలానే సింగరేణి సంస్థను ఏటీఎం లాగా వాడుకున్న చరిత్ర బిఆర్ఎస్ ది కాదా అని ప్రశ్నించారు.ఓపెన్ కాస్ట్ గనుల కు వ్యతిరేఖమని తెలిపిన టీఆర్ఎస్ పదేండ్ల కాలంలో ఒక్క అండర్ గ్రౌండ్ గనినీ కూడా ఎందుకు ప్రారంభించలేదో బాల్క సుమన్ కార్మికులకు తెలుపాలని డిమాండ్ చేసారు.అదే విధంగా నియోజకవర్గ  అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రజాసేవలో ముందుంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపి వంశీ కృష్ణ తో సహా కాంగ్రెస్ శ్రేణులపై బురదజల్లడం సుమన్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు మంద.తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు బేర.వేణుగోపాల్, వీరన్న, ఏడుకోళ్ల.పవన్, దుర్గం ప్రభాకర్, ఎర్ర రాజు, పాషా,శేఖర్, తిరుపతి, రవి కిరణ్, కిరణ్, విజయ్, షరీఫ్, లక్ష్మణ్, మధు తో పాటు నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన..

siti news telangana

మందమర్రి సింగరేణి పాఠశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

siti news telangana

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

siti news telangana