SITI NEWS TELANGANA
తెలంగాణ

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయంగా ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తుంది : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయంగా ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు .

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టిపిసిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ఫై బి ఎల్ ఏ లకు అవగాహన మరియు శిక్షణ శిబిరం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ బిఎల్ఏలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లను ప్రత్యేకంగా గుర్తించి ఎస్ఐఆర్ పేరిట తొలగించే అవకాశం ఉందని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై ఓటు చోరేకి పాల్పడుతుందని అన్నారు. ఎస్ ఐ ఆర్ అనేది అంతా బూటకమని వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం గెలిచే అవకాశం లేకపోవడంతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటు ఉందో లేదో పూర్తిగా చెక్ చేసుకోవాలని అన్నారు. ఓటు హక్కు కోల్పోతే దేశ పౌరసత్వం కూడా కోల్పోతారని అన్నారు. ఓటర్ లిస్టులో లేని వారికి వారసత్వం ఉండదు కనుక వారిని ఎలాగైనా దేశం దాటించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమానికి తెరలేపే అధికారంలోకి వచ్చారని అన్నారు అలాగే తెలంగాణలో కూడా ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అలాంటి వారిని తరిమి కొట్టాలని అన్నారు.

Related posts

పేదింటి ఆత్మగౌరవానికి చిరునామా ఇందిరమ్మ ఇల్లు : గృహ నిర్మాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

siti news telangana

నిఘా నీడలో బొగ్గు రవాణా : ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ

siti news telangana

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు : సింగరేణి పరిరక్షణ సదస్సు

siti news telangana