తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన 36 రోజుల్లోనే శంకుస్థాపన చేసుకోవడం చాలా గర్వకారణమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అయన ఏర్పట్టు చేసిన వేలేకర్ల సమావేశంలో మాట్లాడుతు రేపు గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , మంత్రులు శ్రీధర్ బాబు , జూపల్లి కృష్ణారావు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , విచ్చేస్తున్నారని , 70 కోట్లతో ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని తన అభ్యర్థన మేరకు పిప్పిరి సభలో ముక్య మంత్రి రేవంత్ రెడ్డి మాటిచ్చారని , అన్నట్టుగానే నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను
ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి అలానే మంత్రుల బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేస్తారని చెప్పారు.
మంచిర్యాల పట్టణంలో ఎంతమంది సింగరేణి కార్మికుల పిల్లలకు నియామక పత్రాలు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అనంతరం శ్రీరాంపూర్ సింగరేణి OC ని సందర్శించి , మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయ పున నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని , ఆదివారం రోజున పద్మావతి గార్డెన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క పాల్గొంటారని పెరుకొన్నారు .
ఈ సమవేశంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ,కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
