SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్నికి సత్కారం : మంత్రి వివేక్ వెంకట స్వామి

మందమర్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

మందమర్రి పట్టణ ప్రెస్ క్లబ్ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులు రాం చెందర్, ప్రధాన కార్యదర్శి సలముద్దిన్, కోశాధికారి సకినాల.శంకర తో పాటు పలువురు సభ్యులను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వివేక్ కి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు.అనతరం మంత్రి మాట్లడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి, మందమర్రి పట్టణ అభివృద్ధికి నూతన కమిటీ బాధ్యతాయుతంగా పనిచేయాలని,సమాజ శ్రేయస్సుకై, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ, జర్నలిజం విలువలను కాపాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, ప్రెస్ క్లబ్ బలోపేతానికినూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతిష్ కుమార్ శర్మ, మున్సిపల్ కమిషనర్ తుంగాపిండి.రాజలింగు ,ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి : మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

siti news telangana

పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

జైపూర్ మండలంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమ మట్టి దందా

siti news telangana