సాంకేతిక పద్ధతులు , నిఘా నీడలో బొగ్గు రవాణా : ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ
సింగరేణి సంస్థలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా మందమర్రిలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.బొగ్గు ఉత్పత్తి క్షేత్రాల నుండి వినియోగదారులకు చేరే వరకు ప్రతి దశలోనూ కట్టుదిట్టమైన సాంకేతిక నిఘా ఉందని జీఎం స్పష్టం చేశారు.
అందులో ముఖ్యమైనవి:
(ఆపరేటర్ ఇండిపెండెంట్ ట్రక్ డిస్పాచ్ సిస్టమ్) : ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు లోడింగ్ పాయింట్ నుండి అన్‌లోడింగ్ పాయింట్ వరకు ప్రతి లారీ/డంపర్ కదలికలను ( ఈ జీపీఎస్ ) ఆధారిత సాంకేతికత ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తారు. ఏ వాహనం ఎక్కడ ఆగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది అని.
ఆర్ఎఫ్ఐడి , జియో ఫెన్సింగ్ : బొగ్గు రవాణా చేసే లారీలకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను అమర్చడం జరిగింది.
నిర్దేశిత మార్గం దాటి వాహనాలు పక్కకు వెళ్లకుండా జియో ఫెన్సింగ్ రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది. ఒకవేళ రూట్ మారితే అలారమ్‌లు మోగుతాయి అని .
సీసీటీవీ నిరంతర నిఘా : బొగ్గు నిల్వ కేంద్రాలు, వే-బ్రిడ్జ్‌లు , మరియు సైడింగ్‌ల వద్ద 24 గంటలూ పనిచేసే హై-డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు అని . వీటిని స్థానిక ఏరియా కార్యాలయాల నుంచే కాకుండా కార్పొరేట్ ఆఫీస్ నుండి కూడా పర్యవేక్షిస్తారు అని .
కంప్యూటరైజ్డ్ వే-బ్రిడ్జ్‌లు : ప్రతి బొగ్గు లారీ బరువును డిజిటల్ పద్ధతిలో రికార్డు చేస్తారు. ఇందులో మానవ ప్రమేయం లేకుండా రీడింగ్స్ నేరుగా సర్వర్‌కు అనుసంధానం అవుతాయి అని పెరుకొన్నారు.
అంతర్గత భద్రత మరియు తనిఖీలు :
త్రిసభ్య కమిటీల తనిఖీ : ప్రతి ఏటా, అలాగే అవసరమైన ప్రతిసారీ సింగరేణి అంతర్గత తనిఖీ బృందాలతో పాటు త్రిసభ్య కమిటీల ద్వార బొగ్గు నిల్వలను శాస్త్రీయంగా లెక్కిస్తారు. రికార్డులకు, క్షేత్రస్థాయి నిల్వలకు తేడా వచ్చే ఆస్కారమే లేదు అని.
సింగరేణి సెక్యూరిటీ & విజిలెన్స్ : గనుల పరిసరాల్లో మరియు రవాణా మార్గాల్లో సింగరేణి సొంత సెక్యూరిటీ సిబ్బందితో పాటు విజిలెన్స్ విభాగాలు నిరంతరం గస్తీ కాస్తుంటాయి అని తెలిపారు.
ఇంతటి పటిష్టమైన, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక భద్రతా వ్యవస్థలు ఉన్న సింగరేణిలో బొగ్గు మాయమవడం అనేది ముమ్మాటికీ అసాధ్యమని జీఎం రాధాకృష్ణ తేల్చి చెప్పారు. కార్మికుల కష్టాన్ని, సంస్థ పారదర్శకతను శంకించేలా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.
