SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం : జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

జూన్ 28వ తేదీన జరుగు పల్స్ పోలియో కార్యక్రమని విజయంతం చేయాలి…

మందమర్రి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు.ముందుగ ఆయన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు,ఆసుపత్రి రికార్డులు,మందుల నిల్వలను తనిఖీ చేసిన, విధులకు హాజరైన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అంతరం అయన మాట్లడుతూ ఆసుపత్రిలో అన్ని రకాల అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని,ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేసినట్లు పెరుకొన్నారు.అదేవిధంగా వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు (డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటివి) ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు.లేబొరేటరీ,గదులను పరిశీలించి, ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

అలనే జూన్ 28వ తేదీన జరుగు పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ విద్య, వైద్య ,మున్సిపల్, ఐసిడిఎస్ ఇతర శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క.వెంకటేశ్వర్, ఆశ ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కార్మిక క్షేత్ర పరిసర ప్రాంతాల యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించడమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana

నకిలీ పత్తి విత్తనాల రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్ సీజ్

siti news telangana

కాంట్రాక్టర్ల కబంధ హస్తాలలో ‘మందమర్రి’ అభివృద్ధి

siti news telangana