SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

సోషల్ మీడియా ప్రచారాలు అవాస్తవం : అంజనీపుత్ర ఎస్టేట్స్ యాజమాన్యం స్పష్టీకరణ

సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలను అవాస్తవం

మంచిర్యాల:
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘అంజనీ పుత్ర ఎస్టేట్స్’పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలను ఆ సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆదివారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో చైర్మన్ గుర్రాల. శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లప్పుడూ వినియోగదారుల నమ్మకాన్ని, చట్టపరమైన నిబంధనలను గౌరవిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.అంజనీపుత్ర ఎస్టేట్స్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, పత్రాలు అన్నీ చట్టబద్ధంగా , పారదర్శకంగా ఉన్నాయని తెలిపారు.గత ఎన్నో ఏళ్లుగా వేలాది మంది కస్టమర్ల నమ్మకంతోనే తాము ఈ స్థాయిలో నిలబడ్డామని, ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలను, వదంతులను కస్టమర్లు అలానే ప్రజలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.స్తానిక యువతకు తమ వంతు చేయుతగా ఉద్యోగ అవకాశాలు కలిపిస్తు, ఆదర అభిమానాలను పొందుతున్న ఎదుగుదలను ఓర్వలేక, కక్షపూరితంగానే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తునరాన్ని, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై, అసత్య వార్తలను వ్యాప్తి చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు హేచారించారు.తమ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, అనుమతుల పత్రాలు సంస్థ కార్యాలయంలో పరిశీలించుకోవచ్చని, కస్టమర్ల ప్రయోజనాలకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు.

Related posts

బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు : మందమర్రి ఏరియా

siti news telangana

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం : జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

siti news telangana

గనుల , డిపార్ట్మెంట్ ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా : ఎఐటియుసి యూనియన్

siti news telangana