SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

సింగరేణి పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలి: టీబీజీకేఎస్ పిలుపు

సింగరేణి పరిరక్షణ సదస్సును ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు…

సింగరేణి మనుగడను, కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు నిర్వహించ తలపెట్టిన ‘సింగరేణి పరిరక్షణ సదస్సు’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కేంద్ర అధ్యక్షుడు మిరియాల. రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

మంగళవారం మందమర్రి ప్రెస్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడిపై ఉందన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, విచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన , ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖ కార్మిక నాయకులు కూడా ఈ మహాసదస్సులో పాల్గొంటారని వివరించారు.ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ ఉనికికి పొంచి ఉన్న ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో మేడిపల్లి సంపత్, ఓ రాజశేఖర్, దాసరి శ్రీనివాస్, బండారి సూరిబాబు, బోరిగం వెంకటేష్, భూపెల్లి కనకయ్య, బర్ల సదానందం, తిరుపతి, సారంగపాణి, రమేష్ తో పాటు టీబీజీకేఎస్ స్థానిక నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

siti news telangana

మునీర్ స్ఫూర్తి తో సింగరేణిని పరిరక్షిస్తాం : కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి

siti news telangana

బిఎల్ఎ -2(బూత్ లెవెల్ ఏజెంట్) సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నా మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి

siti news telangana