SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

అధిక సాంద్రత సాగుపై రైతులకు అవగాహన : రైతు వేదికలో విత్తనాల పంపిణీ

సండ్రన్ పల్లి రైతు వేదికలో విత్తనాల పంపిణీ: అధిక సాంద్రత సాగుపై రైతులకు అవగాహన

రైతులు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబించి అధిక లాభాలు గడించాలని మందమర్రి మండలం సండ్రన్ పల్లి రైతు వేదికలో నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో చేన్నూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ పిలుపునిచ్చారు.అధిక సాంద్రత సాగు, సమగ్ర పంట యాజమాన్య విధానాలను ప్రోత్సహించే ఉద్దేశంతో గురువారం రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అనతరం అయన మాట్లడుతూ రైతులకు అధిక సాంద్రతలో పత్తి సాగు వల్ల ఎకరాకు మొక్కల సంఖ్య పెరిగి అధిక దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.అలాగే సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎరువులు, నీటి వినియోగం, కలుపు నివారణ, చీడపీడల సమగ్ర నివారణ వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.రైతులు పంపిణీ చేసిన విత్తనాలను సకాలంలో విత్తి, శాఖ సూచించిన సిఫార్సులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని అధికారులు కోరారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం. రాజశేఖర్, ఎస్. కనకరాజు,సారంగపల్లి సర్పంచ్ బచ్చలి.రాములు శంకర్ పల్లి సర్పంచ్ పెరుమాండ్ల.వెంకటేశ్, ఆదిల్ పేట్ సర్పంచ్ నెండుగురి. పున్నం,ఉప-సర్పంచ్ రాజు, కృషి సఖిలు, రైతులు రాజయ్య, కమలమనోహర్ రావు, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు : మందమర్రి ఏరియా

siti news telangana

సింగరేణి పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలి: టీబీజీకేఎస్ పిలుపు

siti news telangana

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం : డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి

siti news telangana